మీరు కలరా వ్యాపించిన ప్రదేశంలో నివసిస్తున్నట్లయితే లేదా అలాంటి ప్రదేశానికి ప్రయాణిస్తున్నట్లయితే, ఈ పద్ధతులను అనుసరించండి:
- ఆహారం తీసుకొనే ముందు మరియు మరుదొడ్లు ఉపయోగించిన తర్వాత సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రంగా కడగండి.
- ఉడికించిన, శుద్ధి చేసిన లేదా బాటిల్‌లోని నీటిని మాత్రమే త్రాగండి.
- వీలైనంతవరకు వీధి వ్యాపారుల నుండి ఆహార పదార్థాలను తీసుకోవద్దు.
- ద్రాక్ష మరియు బెర్రీలు వంటి తోలు తీయలేని పండ్లను తీసుకోవద్దు.
- సుషీ మరియు షెల్ఫిష్ వంటి జల ఆహారాలను పచ్చిగా గాని లేదా సరిగ్గా వండకుండా గానీ తినవద్దు.