పోలియో పోలియో అంటే ఏమిటి మరియు నా బిడ్డ దానికి ఎలా గురౌతుంది?
పోలియో అనేది వైరస్ వలన కలిగే ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇది నరాల వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు పక్షవాతం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది మరియు కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. పోలియో ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది మరియు ఇది అత్యంత సాంక్రమిక వ్యాధి. ఇది ప్రధానంగా ఫికో-ఓరల్ మార్గం ద్వారా లేదా సాధారణ వాహకం ద్వారా (ఉదాహరణకు, కలుషితమైన నీరు లేదా ఆహారం) వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. అలాగే, మీ బిడ్డ కలుషితమైన బొమ్మల వంటి వస్తువులను వారి నోటిలో పెట్టుకుంటే, వారు సంక్రామ్యతకు గురవుతారు.
ఒకవేళ నా బిడ్డకు పోలియో వస్తే ఏమి జరుగుతుంది?
సిడిసి ప్రకారం, పోలియోవైరస్ సంక్రమించిన ప్రతి నలుగురిలో ఒకరు ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉంటారు, దీనిలో గొంతు నొప్పి, జ్వరం, అలసట, వికారం, తలనొప్పి మరియు కడుపు నొప్పి ఉండవచ్చు. రోగుల్లో కొంత భాగం మెదడు మరియు వెన్నుపాముకు కూడిన లక్షణాలు అభివృద్ధి చెందవచ్చు. పక్షవాతం అనేది పోలియోతో సంబంధం ఉన్న అత్యంత తీవ్రమైన లక్షణం. ఇది శాశ్వత వైకల్యం మరియు మరణానికి దారి తీస్తుంది.
పోలియో నుంచి నా నవజాత శిశువును సంరక్షించుకోవడానికి మార్గాలు ఏమిటి?
పోలియోను నిరోధించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వ్యాక్సినేషన్. ఇతర చర్యల్లో మంచి పారిశుధ్యం మరియు సరైన పరిశుభ్రత ఉన్నాయి. పోలియోపై వ్యాక్సినేషన్ గురించి మరింత సమాచారం గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.