You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Stay
Follow Us
Vaccination Center Near You
dddd

Shingles

కోసం సమాచారం అడుగుతున్నాము:

 

మీకు షింగిల్స్ ముప్పు ఉన్నదా?

మీరు 50 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగి ఉన్నారా?

మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నదా (బలహీన రోగనిరోధకత వ్యవస్థ)?

మీకు చికెన్‌పాక్స్ సోకినదా?

మీకు మధుమేహం, ఆస్తమా లేదా సివోపిడి ఉందా?

షింగిల్స్ గురించి మరియు దానిని నివారించుట గురించి మరింత తెలుసుకోవడానికి, మీ వైద్యుడిని సంప్రదించండి

ఈ ముప్పు పరీక్షను ఇతరులకు షేర్ చేయండి మరియు షింగిల్స్ గురించి మరియు దానిని నివారించుట గురించి వారు మరింత తెలుసుకోవడంలో సహాయం చేయండి..

షింగిల్స్ అంటే ఏమిటి?

షింగిల్స్, దీనిని హెర్పస్ జోస్టర్ అని కూడా అంటారు, ఇది వరిసెల్లా జోస్టర్ వైరస్ మళ్లీ క్రియాశీలం కావడం ద్వారా ఇది వస్తుంది. చికెన్‌పాక్స్ వచ్చిన తరువాత లేదా వరిసెల్లా జోస్టర్ వైరస్ బారినపడినప్పుడు, జీవితకాలం అంతా ఆ వైరస్ మనిషి శరీరంలోనే ఉండిపోతుంది. వయస్సు పెరిగేకొద్ది రోగనిరోధక శక్తి సహజంగానే బలహీనమవుతుంది, అప్పుడు సాధారణంగా నిష్క్రియాత్మక వైరస్ లు తిరిగి క్రియాశీలం కావడానికి వీలు కలుగుతుంది, దానివల్ల షింగిల్స్ వస్తుంది.

అందువల్ల, వృద్ధులకు షింగిల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా నొప్పితో కూడిన, పొక్కులు గల దద్దుర్లను శరీరం లేదా ముఖం యొక్క ఒక వైపున ఏర్పరుస్తుంది.

షింగిల్స్ గురించి తెలుసుకోవడానికి మీరు ఏమి చేయాల్సి ఉంటుంది

షింగిల్స్ ను కలిగించేది ఏమిటి?

వరిసెల్లా జోస్టర్ అనే వైరస్ చికెన్‌పాక్స్ (దీనిని హెర్పస్ జోస్టర్ అని కూడా అంటారు) కు కారణం అవుతుంది. ఒక వ్యక్తికి చికెన్‌పాక్స్ సోకిన తరువాత, ఆ వైరస్ వారి శరీరంలోనే ఉండిపోతుంది మరియు నిష్క్రియాత్మకం అవుతుంది. చాలా సంవత్సరాల తరువాత ఆ వైరస్ క్రియాశీలంగా మారుతుంది మరియు షింగిల్స్ కు కారణం అవుతుంది. ఆ వైరస్ తిరిగి క్రియాశీలం కావడానికి కారణం ఏమిటనే విషయంగా శాస్త్రవేత్తలకు ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే అక్కడ బహుళ కారకాలు ఉండవచ్చు. ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి వయస్సు పైబడే కొద్ది బలహీనం అవుతుంది. రోగనిరోధక శక్తి ఎంత బలహీనం అయితే, వైరస్ తిరిగి క్రియాశీలం కాకుండా నివారించడానికి అంత తక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల వృద్ధులకు షింగిల్స్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

50 మరియు అంతకన్నా ఎక్కువ వయస్సు గల వారికి అధిక ముప్పు ఎందుకు ఉంటుంది?

మొదటగా, ఇప్పటికే చికెన్‌పాక్స్ సోకిన వారందరిలో షింగిల్స్ కారక వైరస్ ఉంటుంది. కొందరికి చికెన్‌పాక్స్ వచ్చి ఉన్నప్పటికీ అది వచ్చినట్లు గుర్తులేకపోవచ్చు లేదా దానిని గుర్తించి ఉండకపోవచ్చు. ఏవిధంగా అయినా, వారిలో వైరస్ తిరిగి క్రియాశీలం అయినప్పుడు, వారు ఎంత ఆరోగ్యంగా ఉన్న అనుభూతి కలిగి ఉన్నప్పటికీ వారికి షింగిల్స్ రావడం జరుగుతుంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు షింగిల్స్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరియు కాలక్రమేణా వయస్సు పైబడే కొద్ది రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉండడం వల్ల, 50 ఏళ్లు దాటిన వారికి ముప్పు అత్యంత ఎక్కువగా ఉంటుంది.

వృద్ధులలో పోస్ట్-హెర్పెటిక్ న్యూరాల్జియా (పిహెచ్ఎన్) వంటి సమస్యలు కూడా వచ్చే ముప్పు పెరుగుతుంది.

షింగిల్స్ ఒక అంటువ్యాధా?

మీకు చికెన్‌పాక్స్ సోకినప్పుడే షింగిల్స్ కారక వైరస్ మీ శరీరంలోకి చేరుతుంది. అది తిరిగి క్రియాశీలం అయ్యే దాకా నిష్క్రియాత్మకంగా ఉండిపోతుంది. అందువల్ల మీరు దీనిని మరొకరికి వ్యాప్తి చేయలేరు.

అయితే, ఒకవేళ ఒకరికి చికెన్‌పాక్స్ రాకపోయినా లేదా దాని నుండి రక్షణ లేకపోయినా వారికి ఇది సోకవచ్చు. షింగిల్స్ సోకిన వ్యక్తి యొక్క పొక్కులతో నేరుగా సంపర్కంలోకి వచ్చిన వారికి చికెన్‌పాక్స్ సంక్రమించవచ్చు.

షింగిల్స్ దద్దుర్లు ఎంత కాలం ఉంటాయి?

షింగిల్స్ అనేవి తరచూ పొక్కుల వంటి నొప్పితో కూడిన దద్దుర్లను ఏర్పరుస్తాయి మరియు 10 నుండి 15 రోజుల కాలంలో ఇవి స్కాబ్స్ గా మారి 2 నుండి 4 వారాల్లో పూర్తిగా నయం అవుతాయి. ఇది సాధారణంగా శరీరం లేదా ముఖంపై ఒక వైపున కనిపిస్తాయి. దద్దుర్లు కనిపించడానికి 48 నుండి 72 గంటల ముందు దద్దుర్లు వచ్చే ప్రాంతంలో వ్యక్తులకు నొప్పి, దురద, జలదరింపు లేదా తిమ్మిరి కలుగుతుంది.

ఒత్తిడి అనేది నాకు షింగిల్స్ సోకే ముప్పును పెంచుతుందా?

ఒత్తిడి అనేది మీకు షింగిల్స్ సోకే ముప్పును పెంచడానికి అవకాశం ఉంది. ఇంతకుముందే చెప్పినట్లుగా షింగిల్స్ వృద్ధి చెందడం కోసం వయస్సు అనేది అత్యంత ముఖ్యమైన కారకంగా ఉంటుంది. అనేక సందర్భాలలో షింగిల్స్ 50 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ వయస్సు గల వారికి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోవడానికి దయచేసి మీ వైద్యునితో మాట్లాడండి.

చికెన్‌పాక్స్ మరియు షింగిల్స్ మధ్య సంబంధం ఏమిటి?

చికెన్‌పాక్స్ అనేది శరీరం అంతటా పొక్కుల వంటి దద్దుర్లను , దురద మరియు జ్వరం కలిగించే చాలా వేగంగా వ్యాపించే ఒక అంటువ్యాధి. చికెన్‌పాక్స్ వైరస్ తిరిగి క్రియాశీలం అయినప్పుడు షింగిల్స్ కు కారణం అవుతుంది. షింగిల్స్ సోకిన వారిలో నొప్పి, దురద, జలదరింపు మరియు పొక్కుల వంటివి శరీరంలోని ఒక ప్రాంతంలో కొన్ని వారాల పాటు ఉండవచ్చు.

నాకు చికెన్‌పాక్స్ రాకపోయినా కూడా ముప్పు ఉంటుందా?

ఒకవేళ ఒకరికి ఎప్పుడూ చికెన్‌పాక్స్ సోకనిచో వారిలో షింగిల్స్ వృద్ధి చెందలేవు. తెలియకుండా, లేదా వారికి గుర్తులేకుండా వారు వైరస్ బారినపడే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో, వృద్ధులలో షింగిల్స్ వృద్ధి చెందే అవకాశం ఉంది.

హెర్పెస్ జోస్టర్ ఆప్థాల్మికస్ అంటే ఏమిటి?

హెర్పెస్ జోస్టర్ ఆప్థాల్మికస్ అనేది కన్ను మరియు కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేయు ఒక షింగిల్స్ ఇన్ఫెక్షన్. లక్షణాలలో నుదుటిపై దద్దుర్లు మరియు కణజాలాలన్నింటిలో నొప్పితో కూడిన వాపు భాగంగా ఉంటాయి.

షింగిల్స్ వల్ల వచ్చే అవకాశం ఉన్న సమస్యలు

షింగిల్స్ ఇన్ఫెక్షన్స్ నుండి అనేక మంది పూర్తిగా కోలుకుంటున్నప్పటికీ, కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి.

  • పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా (పిహెచ్ఎన్)
  • ఆప్థాల్మిక్ వ్యాధి
  • నరాల సమస్యలు
  • వినికిడి సమస్యలు మరియు బ్యాలన్స్ మార్పు

పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా (పిహెచ్ఎన్)

పిహెచ్ఎన్ అనేది షింగిల్స్ బారినపడిన 25% మందిని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య సమస్య. పిహెచ్ఎన్ యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి షింగిల్స్ దద్దుర్లు నయమైన తరువాత నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగే నరాల నొప్పి. ఈ నొప్పి సాధారణంగా ప్రభావిత ప్రాంతంలో వస్తుంది.

ఆప్థాల్మిక్ వ్యాధి

హెర్పెస్ జోస్టర్ ఆప్థాల్మికస్ (హెచ్‌జెడ్ఓ) గల, కన్ను లేదా ముక్కు భాగంగా ఉండే షింగిల్స్ దద్దుర్లు గల 50% మందిలో ఆప్థాల్మిక్ సమస్యలు వస్తాయి. హెచ్‌జెడ్ఓ ఉన్న 50% వరకు వ్యక్తులలో రెండుగా కనిపించే సమస్య రావచ్చు. కంటి నరం దెబ్బతినడం అరుదుగా జరుగుతుంది మరియు హెచ్‌జెడ్ఓ ఉన్న 0.5% వ్యక్తులలో మాత్రమే వస్తుంది.

నరాల సమస్యలు

ఎన్సెఫలైటిస్ (మెదడు వాపు) వంటి నరాల సంబంధ సమస్యలు అరుదుగా సంభవిస్తాయి మరియు షింగిల్స్ సోకిన వారిలో 1% వరకు వ్యక్తులకు సంభవించే అవకాశం ఉన్నట్లు అంచనా.

వినికిడి సమస్యలు మరియు బ్యాలన్స్ మార్పు

అరుదైన సందర్భాలలో, షింగిల్స్ వైరస్ వినికిడి వ్యవస్థలో తిరిగి క్రియాశీలం కాగలదు, ఇది హెర్పస్ జోస్టర్ ఓటికస్ కు దారితీస్తుంది. లక్షణాలలో వినికిడి లోపం, వెర్టిగో, చెవులలో మోత, ముఖంలో తీవ్రమైన నొప్పి, మరియు ముఖ సంబంధ పక్షవాతం (రామ్సే హంట్ సిండ్రోమ్) వంటివి భాగంగా ఉంటాయి. బ్యాలన్స్ తో సమస్యలు షింగిల్స్ సోకిన 1% మందిలో అభివృద్ధి చెందవచ్చు.

ఇది షింగిల్స్ తరువాత వచ్చే ఆరోగ్య సమస్యల యొక్క సమగ్ర జాబితా కాదు. మరింత సమాచారం కోసం వైద్యునితో మాట్లాడండి.

లక్షణాలుషింగిల్స్ యొక్క లక్షణాలు?

షింగిల్స్ సాధారణంగా నొప్పి గల మరియు పొక్కులు గల దద్దుర్లను కలిగించును, మొండెంపై ఎడమ లేదా కుడి వైపు భాగంలో బొబ్బలతో కూడిన చారలు పట్టీ వలె నరం వెంట విస్తరిస్తాయి. ఇది మొండెంపై, చేతులపై, తొడలపై లేదా తల (కళ్లు లేదా చెవులు సహా) పై విస్తరిస్తాయి. వ్యక్తులు సాధారణంగా ఈ బాధను నొప్పి#”, మండడం#, పొడిచినట్లుగా#, లేదా షాక్-వంటిది#గా ఉన్నట్లు వివరిస్తారు. ఇది దుస్తులు ధరించడం, నడవడం మరియు నిద్రపోవడం వంటి రోజువారీ పనులకు ఆటంకం కలిగించవచ్చు.

ఇన్ఫెక్షన్ ఎలాంటి అనుభూతి కలిగిస్తుంది

షింగిల్స్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా శరీరంలోని చిన్న భాగంపై ప్రభావం చూపేదిగా చర్మంపై దద్దుర్లతో ప్రారంభం అవుతుంది. ఇది సోకిన వ్యక్తిలో విద్యుద్ఘాతాల వంటి#, లేదా గోరు చుట్టు# లేదా మరిగిన నీటి వల్ల కలిగే కాలినగాయాలు#, దురద, జలదరింపు, మరియు తిమ్మిరి వంటివి దద్దుర్లు కనిపించడానికి 48 నుండి 72 గంటల ముందు ప్రభావిత ప్రాంతాల్లో కలుగుతాయి.

ఈ వ్యక్తులలో జ్వరం, తలనొప్పి, చలి లేదా కడుపు నొప్పి వంటివి కూడా ఉండవచ్చు.

కాబట్టి, ఒకవేళ మీ తల్లిదండ్రులు లేదా ఇతర పెద్దలు వీటిలో ఏవైనా లక్షణాలను కలిగి ఉంటే, వారిని వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లండి.

గోరు చుట్టు #

విద్యుద్ఘాతాలు #

మరిగిన నీటి వల్ల కాలిన గాయాలు#

షింగిల్స్: నివారణ మరియు చికిత్స ఎంపికలు

ఒకవేళ మీకు షింగిల్స్ వస్తే, షింగిల్స్ గురించి మరియు దాని నివారణ గురించి మరింత సమాచారం కోసం మీ వైద్యునితో మట్లాడండి.

షింగిల్స్ నివారించే ఆప్షన్స్
చికెన్‌పాక్స్ తరువాత శరీరంలో ఉండిపోయిన వైరస్ తిరిగి క్రియాశీలం కావడం వల్ల షింగిల్స్ వచ్చును. కావున, ఒకవేళ ఒక వ్యక్తికి చికెన్‌పాక్స్ రాకపోతే, చికెన్‌పాక్స్ లేదా షింగిల్స్ సోకిన వ్యక్తులతో సంపర్కం లేకుండా ఉండమని చెప్పండి. అలాగే చికెన్‌పాక్స్ వృద్ధి చెందే ముప్పును తగ్గించడానికి చేతుల మరియు దగ్గుకు సంబంధించిన పరిశుభ్రతను అనుసరించేలా చూసుకోండి.

షింగిల్స్ నివారణ కోసం అత్యుత్తమ మార్గాలు ఏమిటి?

షింగిల్స్ నివారణ కోసం టీకా సహాయకరంగా ఉంటుంది. ఒకవేళ మీ పెద్దలు 50 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగి ఉంటే, షింగిల్స్ గురించి మరియు దాని నివారణ గురించి మరింత తెలుసుకోవడానికి మీ వైద్యునితో మాట్లాడండి.

షింగిల్స్ నివారణలో టీకాలు ఏవిధంగా సహాయపడును?

టీకాలు మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా చేస్తాయి దానివల్ల ఇది షింగిల్స్ వైరస్ తో పోరాడగలదు మరియు అది తిరిగి క్రియాశీలం కాకుండా ఉంచగలదు.

షింగిల్స్ కు చికిత్స ఎలా చేయాలి మరియు ఎలా మేనేజ్ చేయాలి?

చికిత్స అనేది తీవ్రతను తగ్గించవచ్చు మరియు అనారోగ్య వ్యవధిని తగ్గించవచ్చు మరియు మీ లక్షణాల ఆధారంగా వైరస్ ను బలహీనం చేయవచ్చు మరియు/లేదా నొప్పి నుండి ఉపశమనం కలిగించవచ్చు.

ఒకవేళ మీకు షింగిల్స్ ఉన్నట్లు మీరు భావిస్తే, దయచేసి సాధ్యమైనంత త్వరగా మీ వైద్యునితో మాట్లాడండి. వారు తీవ్రతను మరియు లక్షణాలు కొనసాగే వ్యవధిని తగ్గించడంలో సహాయపడే తగిన ఔషధాలను అందించవచ్చు.

 

లక్షణాలను మేనేజ్ చేయడం కోసం సాధారణ సలహా:

  • దద్దుర్లను శుభ్రంగా మరియు పొడిగా ఉంచడం ద్వారా ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించాలి
  • వదులుగా ఉండే దుస్తులను ధరించాలి
  • రోజుకు కొన్నిసార్లు కూల్ కంప్రెస్ ఉపయోగించాలి

షింగిల్స్ గురించి మరియు దాని నివారణ గురించి మరింత తెలుసుకునేందుకు వైద్యునితో మాట్లాడండి.


ప్రస్తావనలు

REFERENCES
  • Harpaz R et al. MMWR Recomm Rep. 2008 Jun 6;57(RR-5):1-30.
  • eMedicineHealth; 2021; 1-69; Shingles Treatment, Causes, Pictures & Symptoms (REF-143781)
  • Katz J, Melzack R. Measurement of pain. Surg Clin North Am. 1999;79:231252.
  • Weaver BA. J Am Osteopath Assoc. 2009;109(6 Suppl 2):S2
  • CDC Shingles (Herpes Zoster) Clinical overview. Available from: Clinical Overview of Herpes Zoster (Shingles) | CDC Accessed August 2023.
  • Lokeshwar MR;Indian pediatrics;2000;37;714-719
  • Simon AK et al. Proc Biol Sci 2015;282:20143085.
  • Al-Jabri M et al. Infect Dis Clin North Am. 2023;37(1):103-121.
  • CDC. Cause and transmission. https://www.cdc.gov/shingles/about/transmission.html. Accessed Jan 2024.
  • CDC. Signs and symptoms. https://www.cdc.gov/shingles/about/symptoms.html. Accessed Jan 2024.
  • AAD. https://www.aad.org/public/diseases/a-z/shingles-symptoms. Accessed Jan 2024.
  • Schmidt SAJ, et al. Br J Dermatol. 2021;185(1):130-138.
  • Kedar S et al. Journal of Neuro-Opthalmology;2019;39;220-231.
  • Zoster vaccines for Australian adults. NCIRS.2022;1-17.
  • Espiritu R et al. Infectious Disease in Clinical Practice;2007;15;284-288.
  • Crouch AE. NCBI Bookshelf;2022;1-12- Intro (p.1)
  • CDC. Clinical overview of shingles (Herpes zoster). Accessed Jan 2024
  • CDC. Shingles vaccination. Accessed Jan 2024.
  • AAD. https://www.aad.org/public/diseases/a-z/shingles-self-care. Accessed Jan 2024 [Jhumpi Kamki]
  • Johnson RW et Al. BMC Med. 2010;8(1):37 as per the core claims document.